మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. డ్రగ్స్ కేసు నమోదు
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌పై 67బీ, ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా తాజాగా 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు. ప్రణీత్‌ను విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.