గత ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడిలా జరిగి ఉండేది కాదు.. రషీద్ హత్యపై ఏపీ మంత్రి ఫరూక్
- బాధితుడు, నిందితుడు ఇద్దరూ వైసీపీలో కలిసి తిరిగారన్న మంత్రి
- రెండేళ్ల క్రితమే ఇద్దరికీ గొడవ జరిగిందని గుర్తు చేసిన ఫరూక్
- ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరిక
ఇలాంటి ఘటనే ఎన్నికలకు ఆరునెలల ముందు నంద్యాలలో జరిగిందని, అక్కడ పట్టపగలు హత్య జరుగుతుంటే అందరూ చూస్తూ ఊరుకున్నారని, ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని గుర్తుచేశారు. ఎన్నికలకుముందు జిలానీ టీడీపీలోకి వచ్చినంత మాత్రాన హత్యను పార్టీకి అంటగట్టడం, ముఖ్యమంత్రే ఇందుకు బాధ్యత వహించాలని అనడం సరికాదన్నారు. శిక్షించే విషయంలో పార్టీలు చూడబోమని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఫరూక్ హెచ్చరించారు.