టీటీడీ నుంచి కీలక అప్‌డేట్... శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్లు రోజుకు 1000
- సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు
- గోకులం విశ్రాంతి భవనంలో 900 టిక్కెట్ల జారీ
- మొదట వచ్చిన వారి ప్రాతిపదికగా టిక్కెట్ల జారీ
- శ్రీవాణి దాతలకు మిగిలిన 100 టిక్కెట్ల జారీ
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టిక్కెట్లను మొదట వచ్చిన వారికి ఇస్తారు. మిగిలిన 100 టిక్కెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలోనే కరెంట్ బుకింగ్ కౌంటర్‌లలో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయ కౌంటర్‌లో ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది.