ముంబై డబ్బావాలాను కాపీ కొట్టిన బ్రిటన్ కంపెనీ.. ఆరేళ్లు పూర్తయ్యాయని ట్వీట్
- ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు లండన్ లో ‘డబ్బాడ్రాప్’
- ముంబై డబ్బావాలా తరహాలో లంచ్ బాక్స్ సేవలు
- ఎలక్ట్రిక్ సైకిల్ పై బాక్సుల్లో ఆహారం అందజేస్తున్న కంపెనీ
డబ్బాలో ఆహార పదార్థాలను సర్దడం మొదలుకొని కస్టమర్ వాటిని ఆరగించే వరకూ ఈ షార్ట్ వీడియోలో డబ్బాడ్రాప్ నిర్వాహకులు చూపించారు. స్టీల్ టిఫిన్ క్యారేజీలో ఓ డబ్బాలో అన్నం, మరో డబ్బాలో పన్నీర్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీని సంస్థ సిబ్బంది నీట్ గా ప్యాక్ చేశారు. ఆపై డబ్బాను ఓ రుమాలుతో కడతారు. డబ్బాడ్రాప్ సిబ్బంది వీటిని ఎలక్ట్రిక్ సైకిల్ తో వాటి చిరునామాలకు చేరుస్తారు. ఈ పధ్ధతి ద్వారా గడిచిన ఆరేళ్లలో లండన్ లో 3.75 లక్షల ప్లాస్టిక్ కంటెయినర్ల వాడకాన్ని తప్పించినట్లు డబ్బాడ్రాప్ పేర్కొంది. డబ్బాడ్రాప్ కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, ప్రస్తుతం లండన్ కే పరిమితమైన సేవలను త్వరలోనే దేశమంతటా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.