అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy admits NIMS in Hyderabad
  • ఆర్.నారాయణమూర్తికి అనారోగ్యంపై అభిమానుల్లో ఆందోళన
  • స్పందించిన ఆర్.నారాయణమూర్తి
  • అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని వెల్లడి
  • ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరణ
ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా, తన గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న ఆర్.నారాయణమూర్తి స్పందించారు. 

ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నానని, దేవుడి దయతో వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.
Go Back to Shorts
R Narayana Murthy
NIMS
Hyderabad
Tollywood

More Telugu News