హైదరాబాద్ లో మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
- ఆటోలో తీసుకెళ్లి మహిళపై అత్యాచారం
- అల్వాల్ లో శుక్రవారం జరిగిన ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి
- బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్
వారిద్దరూ మద్యం తాగుతూ బలవంతంగా బాధితురాలికీ తాగించారు. ఆపై ఆటోను వెంకట్రావ్ లేన్ లోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఓ కారులోకి ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ వెళ్లిపోగా.. మిగతా ఇద్దరు ఆమెపై కారులోనే అత్యాచారం చేశారు. శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు గణేశ్ ఆలయం వద్దకు చేరుకుంది. స్థానికుల సాయంతో పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని పీఎస్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. కేసును అల్వాల్ స్టేషన్ కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన అల్వాల్ పోలీసులు.. ఆటో నెంబర్ సాయంతో డ్రైవర్ ను అరెస్టు చేశారు. అయితే, మహిళపై అత్యాచారం చేసిన నిందితులు మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.