Sonakshi Sinha: జీ 5లో హారర్ కామెడీ థ్రిల్లర్ గా 'కాకుదా' .. కథ ఇదే!

Kakuda Movie Update
షార్ట్స్‌లో చూడండి
ఓటీటీ తెరపై థ్రిల్లర్ జోనర్లోని కథలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందువలన సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీ బాటపడుతున్నాయి. ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు పోటీ పడుతున్నాయి. మేకర్స్ కూడా అలాంటి కాన్సెప్ట్ లపైనే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమానే 'కాకుదా'.

 ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సోనాక్షి సిన్హా .. రితీష్ దేశ్ ముఖ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ సినిమా జీ 5లో అందుబాటులో ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.  'కాకుదా' అనేది విలేజ్ నేపథ్యంలో సాగే ఒక దెయ్యం కథ. దెయ్యం చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతుంది. 

'రథోడి' అనే ఒక గ్రామానికి ప్రతి మంగళవారం ఒక నిర్ణీత సమయానికి దెయ్యం వస్తూ ఉంటుంది. దెయ్యంవచ్చే సమయానికి అంతా తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయానికి అలా చేయకపోతే ఆ ఇంటి నుంచి ఒకరు చనిపోతుంటారు. అందువలన గ్రామస్తులంతా ఆ సమయానికి అక్కడికి చేరుకుంటారు. దెయ్యాలు పట్టుకునే వ్యక్తిగా ఆ గ్రామానికి హీరో వస్తాడు. దెయ్యం కారణంగా తన భర్తను పోగొట్టుకున్న ఓ యువతి' అతనితో చేతులు కలుపుతుంది. ఫలితంగా వాళ్లకి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ. 

Go Back to Shorts
Sonakshi Sinha
Ritesh Deshmukh
Kakuda Movie

More Telugu News