అనంత్ అంబానీ వివాహానికి వెళ్లకపోవడానికి కారణం ఇదే: తాప్సీ
- అనంత్ అంబానీ వివాహానికి దూరంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు
- అంబానీ కుటుంబంతో తనకు పరిచయం లేదన్న తాప్సీ
- పరిచయం ఉంటేనే ఎవరి పెళ్లికైనా వెళ్తానని వివరణ
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్న తాప్సీకి ఎదురయింది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అంబానీ కుటుంబంతో తనకు ఎలాంటి అనుబంధం లేదని తెలిపింది. వ్యక్తిగతంగా వారితో తనకు పరిచయం లేదని చెప్పింది. ఎవరి పెళ్లికైనా వారితో పరిచయం ఉంటేనే తాను వెళ్తానని తెలిపింది. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత అంశమని చెప్పింది.