KTR: రేవంత్ రెడ్డి 6 నెలల పాలనలోనే మందుగోళీలు దొరకని పరిస్థితి: కేటీఆర్

No medicines in government hospitals in Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందు గోళీలు దొరకని దుస్థితి నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'సర్కార్ దవాఖానాల్లో గోలీల్లేవ్!' అని నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశారు.

పదేళ్ల కేసీఆర్ పాలన వైద్యానికి జవసత్వాలు ఇచ్చిందని పేర్కొన్నారు. 'నేను రాను బిడ్డో  సర్కారు దవాఖానాకు' అనే దశాబ్దాల దుస్థితి నుంచి 'చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు' అనే ధీమాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

కానీ, గద్దెనెక్కిన ఆరునెలల్లోనే కనీసం మందు గోళీలు కూడా దొరకని దుస్థితికి ప్రభుత్వ ఆసుపత్రులను రేవంత్ రెడ్డి సర్కార్ దిగజార్చిందని ఆరోపించారు. పాలన గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు అయ్యాయని మండిపడ్డారు.
Go Back to Shorts
KTR
Revanth Reddy
Telangana

More Telugu News