250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులతో సమీక్ష
- ఏపీలో 7,213 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడి
- రోడ్ల నిర్మాణం కోసం రూ.4,976 కోట్లను ఖర్చు చేస్తామన్న ఉపముఖ్యమంత్రి
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో 7,213 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం కోసం రూ.4,976 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.