ఒక్క రూపాయి ఆదాయపు పన్ను వివాదం.. సీఏకు రూ. 50 వేల చెల్లింపు!
- ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు అందుకున్న అపూర్వ్ జైన్
- దానిని పట్టుకుని సీఏ వద్దకు వెళ్తే రూ. 50 వేల ఫీజు
- చివరికి ఆ నోటీసు రూపాయి వివాదానికి సంబంధించినదని తేలిన వైనం
- నెత్తీనోరూ బాదుకుంటూ సోషల్ మీడియాకెక్కిన అపూర్వ్ జైన్
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన ఆవేదన వెళ్లగక్కాడు. ఇది చూసిన నెటిజన్లు రెండుగా విడిపోయి చర్చకు తెరదీశారు. కొందరు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మరికొందరు జైన్‌ను తప్పుబడుతున్నారు. వివాదంలో ఉన్న మొత్తం గురించి అతడు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చిన్న మొత్తాల విషయంలో సీఏ జోక్యం లేకుండానే పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. చాలామంది ట్యాక్స్ టెర్రరిజం బారిన పడుతున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.