త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్
- త్రివిక్రమ్ చెడు స్వభావం తనకు తెలుసన్న పూనం
- జీవితాలను నాశనం చేసే స్వభావం కలవాడని వ్యాఖ్య
- ఆయనతో తనకున్న అనుభవం సరైంది కాదన్న పూనం
త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయిండొచ్చని... కానీ, తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.