TGS RTC: ఫ్రెండ్లీ కండక్టర్ అనూపరాణికి సజ్జనార్ అభినందన

RTC MD Sajjanar Intresting Tweet On Conductor AnupaRani
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది కారణంగానే ఆర్టీసీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చుతోందంటూ ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్ బస్ డిపో కండక్టర్ అనూపరాణిని ప్రశంసిస్తూ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. గడిచిన 24 ఏళ్లుగా ఆర్టీసీ ప్రయాణికులకు నవ్వుతూ, నవ్విస్తూ సేవ చేస్తున్నారంటూ అనూపరాణిని కొనియాడారు. అనూపరాణిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ తో షేర్ చేశారు. రాజేంద్ర‌నగర్ బస్ డిపోకు చెందిన రాగమల్ల అనూపరాణి ఫ్రెండ్లీ కండక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
Go Back to Shorts
TGS RTC
MD Sajjanar
Conductor AnupaRani
Rajendranagar Depot
Hyderabad

More Telugu News