Engineering courses Fee: ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

Engineering fee courses declared in AP
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1.03 లక్షల నుంచీ రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు. 

రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్చిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ. లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు అయ్యింది. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. ఇక అదనంగా కళాశాలలు ఏమీ వసూలు చేయకూడదు. 

వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. 

గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ ఉమెన్ కళాశాలలకు రూ. 1.05 లక్షల చొప్పున , విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు రూ. 1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఫీజు రూ.93,700 గా ఖరారు చేశారు.
Go Back to Shorts
Engineering courses Fee
Andhra Pradesh

More Telugu News