రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఆ రెండు కూడా గెలుస్తుంది: జై షా
- రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
- రాబోయే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుస్తామన్న జై షా
- రోహిత్ శర్మ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని వెల్లడి
"టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుచుకుని బార్బడోస్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుందని నేను రాజ్ కోట్ లోనే చెప్పాను. రోహిత్ శర్మ అది నిజం చేసి చూపించాడు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి 5 ఓవర్లే నిర్ణయాత్మకంగా మారాయి. ఆఖరి ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించారు.
ఈ వరల్డ్ కప్ విజయం తర్వాత మా టార్గెట్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ. ఈ రెండింటిలోనూ రోహిత్ శర్మ టీమిండియాను విజయపథంలో నడిపిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది" అని జై షా వివరించారు.
కాగా, టీ20 వరల్డ్ కప్ విజయాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు అంకితం ఇస్తున్నట్టు జై షా ప్రకటించారు.