శ్రీధర్ బాబును కలిసిన పలువురు ఎమ్మెల్యేలు
- మంత్రిని కలిసిన వారిలో సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ
- ఇంకా కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా...
- జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.