అన్నమయ్య జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

Four dead on spot in an accident held in Annamayya district
  • రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద ఘటన
  • టిప్పర్‌ను ఢీకొన్న కారు
  • మృతులు  కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో రాయచోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతులను కడప జిల్లాకు చెందిన అంజినాయక్ (29), షేక్ అలీమ్ (32), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (30)గా గుర్తించారు.

కాగా, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బస్సు అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను సత్యసాయి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
Go Back to Shorts
Road Accident
Annamayya District
Kadapa
Chittor

More Telugu News