రేవంత్ రెడ్డికి యువత అంటే ప్రేమ లేదు: కేటీఆర్ విమర్శలు

KTR fires at Revanth Reddy over unemployment
  • నిరుద్యోగులు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని మండిపాటు
  • నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కార్ ఇది అని ఆగ్రహం
  • నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెబితే నిర్బంధమా? అని ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువత అంటే ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా?? తెల్ల దొరల పాలన కన్నా..
దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు ప్రజా పాలన అంటూనే... మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంబిస్తారా?? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ప్రజా పాలన కాదు... ముమ్మాటికీ ప్రజాకంఠక పాలనే అన్నారు. ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక.. 
మరో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో.. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో.. అట్టర్ ఫ్లాప్ అయినందుకు.. వెంటనే నిరుద్యోగులకు.. కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును... ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.
Advertisement
KTR
Telangana
Revanth Reddy

More Telugu News