కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ లీగల్ నోటీసులు
- తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు పెట్టారని ఆవేదన
- తప్పుడు ప్రచారం చేసినందుకు లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఇందిరమ్మ రాజ్యం... ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.