మ్యాచ్ మధ్యలో గుండెపోటు.. చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి.. వీడియో ఇదిగో!
- ఇండోనేసియాలోని యోగ్యాకార్తాలో ఘటన
- ఉన్నట్టుండి కోర్టులో కుప్పకూలిన ప్లేయర్
- ఆసుపత్రికి తరలించేలోగానే మృతి
యోగ్యాకార్తలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్ డ్ పోటీలలో చైనాకు చెందిన ప్లేయర్ జాంగ్ జిజీ పాల్గొన్నాడు. జపాన్ ప్లేయర్ కజుమా కవానోతో జరుగుతున్న మ్యాచ్ లో జిజీ కుప్పకూలాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనపై రిఫరీ స్పందించేందుకు కాస్త ఆలస్యం జరిగింది. ఫిజియోలను పిలవగా వారు వచ్చి జిజీని పరీక్షించారు. ఆపై జిజీని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జిజీ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. జాంగ్ జిజీ గతేడాదే చైనా జూనియర్ జట్టులో చేరాడని అతడి సహచరులు చెప్పారు. అంతలోనే జిజీ ఆకస్మికంగా మరణించడంతో ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది.