'కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం!' అంటూ కేటీఆర్ ట్వీట్‌!

KTR Tweet on Kaleshwaram Project
'మా కరువులకు కన్నీళ్లకు.. శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి కన్ను కుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం' అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పోస్టు పెట్టారు. తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని పేర్కొన్నారు.

“దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!.. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన పుణ్య వరం కాళేశ్వరం!.. నీళ్లు రాక.. ఒట్టిపోయిన నిజాంసాగర్ కు నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం.. మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం!.. మా తపన.. ఆలోచన.. అన్వేషణ.. జలదౌత్యానికి.. నిదర్శనం కాళేశ్వరం .. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం! ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం.. సరిదిద్దుకోగలం! రాజకీయ కుళ్లు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం. మీ ఏడుపే మా ఎదుగుదల.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
KTR
BRS
Kaleshwaram Project
Telangana

More Telugu News