అనుష్క శర్మను ఉద్దేశించి ఇన్ స్టాలో కోహ్లీ ఆసక్తికర పోస్ట్

Kohli shares heartfelt note for Anushka Sharma
  • టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న టీమిండియా
  • ఫైనల్లో అద్భుతంగా రాణించిన కోహ్లీ
  • తన ఘనతలో అనుష్క పాత్ర ఉందని వెల్లడి
  • ఈ విజయం నీది కూడా అంటూ స్పందన
టీమిండియా స్టయిలిష్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తాజాగా తన అర్ధాంగి అనుష్క శర్మను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ సందేశం పోస్టు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించిన నేపథ్యంలో... కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫైనల్లో కోహ్లీ చేసిన 76 పరుగులు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీకే లభించింది. తన విజయం వెనుక ఉన్నది అనుష్క శర్మ అని కోహ్లీ తన సందేశం ద్వారా వివరించాడు. 

"నా ప్రియతమా... నేను సాధించిన ఘనతలో ఏ కొద్ది భాగం కూడా నువ్వు లేకుండా సాధ్యం కాదు. నేను ఎలాంటి గర్వం లేకుండా, నిరాడంబరంగా ఉన్నానంటే అందుకు నువ్వే కారణం. సంపూర్ణమైన నిజాయతీ వల్లే ఇలా ఉండడం సాధ్యమవుతుందని నువ్వు ఎప్పుడూ చెబుతుంటావు. అందుకు నీకెన్ని కృతజ్ఞతలు చెప్పాలో! ఈ విజయం నాది మాత్రమే కాదు నీది కూడా. నువ్వు నువ్వుగా ఉన్నందుకు నిన్ను ప్రేమిస్తున్నాను... థాంక్యూ!" అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
Team India
T20 World Cup 2024

More Telugu News