బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన
- ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం
- శని, ఆదివారాల్లో తెలంగాణలోని 15 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాలకు పసుపు అలర్ట్
ఇక రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయికల్ మండలం అల్లీపూర్లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి.