బీఆర్ఎస్కు షాక్... కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కాలె యాదయ్య
- చేవెళ్ల నుంచి 268 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాలె యాదయ్య
- ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
కాలె యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలిచారు. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు.