‘థాంక్యూ సర్’.. అన్న మహిళను విమానం ఎక్కనీయని సిబ్బంది!
- అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘటన
- ఆస్టిన్‌కు వెళ్లేందుకు తన బిడ్డ, తల్లితో విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికురాలు
- మహిళా సిబ్బందికి బోర్డింగ్ పాస్ ఇచ్చే క్రమంలో సర్ అంటూ ధన్యవాదాలు చెప్పిన వైనం
- మహిళా అటెండెంట్ ఆగ్రహం, వారిని లోపలికి అనుమతించని వైనం
ఈ క్రమంలో జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఆ అటెండెంట్ 'ఆయన కాదు ఆమె' అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్న జెన్నా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.