Mohammed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు.. ఇద్దరు మంత్రుల అరెస్టు

Minister accused of using black magic against maldivian president is arrested says regional media
మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారట. అయితే, పోలీసులు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. 

‘‘షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరినీ ఆదివారం ఆరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు’’ అని ఓ వార్తా వెబ్‌సైట్ పేర్కొంది. గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. అయితే, తాజా పరిణామాలపై ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు.
Mohammed Muizzu
Black Magic
Maldives

More Telugu News