ఎట్టకేలకు ప్రారంభమైన టీమిండియా-ఇంగ్లండ్ సెమీస్... అంతలోనే మళ్లీ వర్షం
- గయానాలో తగ్గిన వాన
- ఆలస్యంగా ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- మరోసారి స్వల్ప స్కోరుకే అవుటైన కోహ్లీ
ఈ నేపథ్యంలో, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 2.4 ఓవర్లలో 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓ సిక్స్ బాది ఊపుమీదున్నట్టు కనిపించిన విరాట్ కోహ్లీ... అదే ఓవర్లో రీస్ టాప్లే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 9 పరుగులు చేశాడు.
8 ఓవర్ల వద్ద వరుణుడి బ్రేక్
8 ఓవర్లు ముగిసిన అనంతరం వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి టీమిండియా 2 వికెట్లకు 65 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్ విరాట్ కోహ్లీ 9, రిషబ్ పంత్ 4 పరుగులకే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 1, శామ్ కరన్ 1 వికెట్ తీశారు.