Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో అమానుష చ‌ర్య‌.. కావాల‌ని కారు ఎక్కించి లేగ‌దూడ‌ను చంపిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్‌!

Man Intentionally Crushes Innocent Calf With Car In Chhattisgarh
షార్ట్స్‌లో చూడండి
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన అమానుష‌ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రోడ్డుపై ఉన్న ఆవుల ప‌ట్ల ఓ వ్య‌క్తి  రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించ‌డం వీడియోలో ఉంది. రోడ్డుపై పడుకున్న లేగ‌దూడ‌పైకి అత‌డు కావాల‌నే తన హ్యుందాయ్ కారును ఎక్కించాడు. అంతేగాక రివ‌ర్స్ గేర్‌లో మ‌రోసారి దానిపైకి కారును తీసుకెళ్ల‌డంతో లేగ‌దూడ చ‌నిపోయింది. 

త‌న బిడ్డ‌ను ర‌క్షించుకునేందుకు ఆ త‌ల్లి ఆవు త‌ల్ల‌డిల్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అలాగే అక్క‌డ ఉన్న 7 నుంచి 8 ఆవులు మార్గమధ్యంలో చనిపోయి పడి ఉన్న దూడ దగ్గరికి పరుగెత్తడం కూడా వీడియోలో ఉంది. ఇక వీడియోను ఛత్తీస్‌గఢ్ సుదర్శన్ ఛానెల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజ‌న్లు స‌ద‌రు వ్య‌క్తిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  

కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమానిని షేక్ షాహిద్ గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంఘాలు కోరాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
Go Back to Shorts
Chhattisgarh
Calf
Viral Videos

More Telugu News