సెమీస్‌లో పేకమేడలా కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్.. దక్షిణాఫ్రికా ముందు ఈజీ టార్గెట్
- కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్థాన్
- చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు
- కేవలం 10 ఓవర్లలోనే చాపచుట్టేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లు
ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 2, గుల్బాదిన్ నబీ 9, మహమ్మద్ నబీ 0, నంగేయలియా ఖరోటే 2, కరీం జనత్, రషీద్ ఖాన్ 8, నూర్ అహ్మద్ 0, నవీన్ ఉల్ హక్ 2, ఫరూఖీ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా టార్గెట్ కేవలం 57 పరుగులు మాత్రమే కావడంతో ఆ జట్టు ఫైనల్ చేరుకోవడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం లేదనే చెప్పాలి.