లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక
- మూజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటన
- ఆయనను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లిన మోదీ, రాహుల్
- వరుసగా రెండోసారి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించనున్న ఓం బిర్లా
రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు. కాగా, డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు. గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదనే విషయం తెలిసిందే. మరోవైపు, స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు.