టీడీపీ-జనసేనను విడదీసేందుకు జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు: టీడీపీ
- ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టే నీచపు బుద్ధి జగన్‌కే సొంతమన్న టీడీపీ
- ‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టీకరణ
- ‘ఐప్యాక్’తో పెట్టించి ఎన్నికలకు ముందునుంచీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక
యువగళం అనే యూట్యూబ్ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినీ అభిమానుల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.