'కేరళ'ను 'కేరళం'గా మార్చాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం
- గతంలోనే కేంద్రానికి తీర్మానం పంపించిన కేరళ ప్రభుత్వం
- సవరణలు కోరుతూ తిప్పిపంపిన కేంద్రం
- సవరణలు చేసి తీర్మానం ప్రవేశపెట్టిన కేరళ ప్రభుత్వం
రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రాన్ని అధికారికంగా 'కేరళం'గా మార్చడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు.