Danam Nagender: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయం!

BRS to go SC on Danam Nagendar party change
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ దాదాపు నిర్ణయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారని... అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావించింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మూడు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయనిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం... పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ ఉంది. ఆ రోజున దానంపై అనర్హత వేటు పడకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ దాదాపు నిర్ణయించింది. దానంతో పాటు పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా ఒకేసారి వెళ్లాలని నిర్ణయించింది.
Go Back to Shorts
Danam Nagender
BRS
Congress
Supreme Court

More Telugu News