పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయం!
- బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు!
- దానంపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై న్యాయనిపుణులతో చర్చ
- ఈ నెల 27న హైకోర్టులో దానం అనర్హత అంశంపై విచారణ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మూడు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయనిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం... పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ ఉంది. ఆ రోజున దానంపై అనర్హత వేటు పడకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ దాదాపు నిర్ణయించింది. దానంతో పాటు పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా ఒకేసారి వెళ్లాలని నిర్ణయించింది.