బాపట్ల జిల్లా అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
- ఈపూరుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య
- నిన్న రైలు పట్టాల పక్కన మృతదేహం
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- ఘటన స్థలానికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
కాగా, ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ స్పందించారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఈపూరుపాలెంకు చెందినవారేనని తెలిపారు. మద్యం మత్తులో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారని ఎస్పీ వివరించారు.