ప్రపంచంలో బెస్ట్ బౌలర్ అతడేనన్న సూర్యకుమార్ యాదవ్
- ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ వరల్డ్ బెస్ట్ బౌలర్ అని ప్రశంసించిన సూర్య
- అతడిని డామినేట్ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్య
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు స్వీకరించిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఇంతకుముందూ చెప్పాను. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షప్రసారంలో చెబుతున్నాను. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం. అయితే నేను క్రీజులో ఉన్నప్పుడు అతడి బౌలింగ్‌లో ఏ షాట్లు ఆడాలో నాకు తెలుసు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అయిన రషీద్ ఖాన్‌పై ఒక బ్యాటర్‌గా ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదు. అయితే ఈ రోజు నేను మెరుగైన జట్టు వైపు ఉండడం సంతోషంగా ఉంది’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వేసిన 6 బంతులను ఎదుర్కొన్న సూర్య 16 పరుగులు బాదాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తన వ్యక్తిగత ప్రదర్శనపై సూర్య మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన వెనుక కృషి, ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పాడు. తాను మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఏం చేయాలనేదానిపై స్పష్టతతో ఉంటానని వివరించారు. కాగా 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.