Ram Gopal Varma: ‘క‌ల్కి’ ట్రైల‌ర్‌పై ఆర్‌జీవీ ప‌జిల్.. గెలిస్తే రూ.ల‌క్ష క్యాష్ ప్రైజ్ కూడా!

Director Ram Gopal Varma Puzzle on Kalki 2898 AD Release Trailer
షార్ట్స్‌లో చూడండి
రెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందిన మూవీ ‘కల్కి 2898’. ఈ చిత్రం ఈ నెల 27న‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైల‌ర్‌లో డైరెక్ట‌ర్‌ నాగ్ అశ్విన్ ఓ కొత్తలోకాన్ని ఆవిష్కరించాడ‌నే చెప్పాలి. ఫైనల్ వార్ అంటూ మూవీ మేకర్స్ సినిమా విడుద‌ల‌కు ఆరు రోజుల ముందు ఈ ట్రైలర్ తీసుకొచ్చారు. తొలి ట్రైలర్ లాగే ఈ రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. 

ఇక‌ ఈ ట్రైల‌ర్ చూసిన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మూవీ మేక‌ర్స్‌పై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ట్రైల‌ర్ చాలా అద్భుతంగా ఉందంటూ.. నెటిజ‌న్లకు ఈ ట్రైల‌ర్‌పై ఒక పజిల్ ఇచ్చాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కొన్ని లెట‌ర్స్‌ను మిస్ చేశాడు. ఈ ప‌జిల్‌ను ఎవ‌రైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్ల‌కి ల‌క్ష రూపాయ‌ల క్యాష్ ప్రైజ్‌ ఇస్తాన‌ని పేర్కొన్నాడు. మరి ఇంకెందుకు ఆల‌స్యం.. ఆ ప‌జిల్‌ను మీరు సాల్వ్ చేయ‌గ‌ల‌రేమో ఒక‌సారి ప్ర‌య‌త్నించండి.

‘కల్కి 2898’ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్
తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్ ల‌భించింది. ‘కల్కి 2898’ మూవీ 3 గంటల 56 సెకన్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది. అయితే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ మూడు గంటల పాటు ఉండటమే మైనస్ అవుతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు వేర్వేరు ప్రపంచాల చుట్టూ తిరిగే కథే ఈ  ‘కల్కి 2898’ చిత్రం అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Ram Gopal Varma
Kalki 2898 AD
Kalki 2898 AD Release Trailer
Prabhas
Nag Ashwin
Tollywood
RGV

More Telugu News