ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి
- రేపటి నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
- గోరంట్లతో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించిన గవర్నర్
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశం కానుండడంతో, ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభా వ్యవహారాలను నడిపించనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక లాంఛనాలను ఆయన ప్రొటెం స్పీకర్ హోదాలో పర్యవేక్షించనున్నారు.