ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
- నిజామాబాద్ జిల్లాలో పది మంది బాధితులు
- పీఎం కిసాన్ యాప్ లింక్ ను క్లిక్ చేయడంతో హ్యాక్
- వాట్సాప్ ఓపెన్ కావట్లేదని, ఇతరులకు మెసేజ్ లు పోతున్నాయని ఆవేదన
ఈ నేపథ్యంలోనే తాజా లింక్ వాట్సాప్ గ్రూప్ లలో చక్కర్లు కొడుతోంది. పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు.. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ విషయమై సైబర్ క్రైం డీఎస్పీ హసీద్ ఉల్లాను మీడియా సంప్రదించగా.. మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పీఎం కిసాన్ యాప్ పేరుతో ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.