పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవడంపై దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం
- 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పాత పుస్తకాలనే కొనసాగించామని వెల్లడి
- ఇప్పుడు ముందుమాటలో కేసీఆర్ పేరు ఉండటాన్ని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని విమర్శ
- భేషజాలు లేవని చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తుందేమిటని నిలదీత
కానీ, ఇప్పుడు ముందుమాటలో కేసీఆర్ పేరు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని ధ్వజమెత్తారు. దాదాపు 2 కోట్లకు పైగా పుస్తకాలు వెనక్కి తెప్పించినట్లు తెలుస్తోందని... అలా చేయడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. ఇప్పుడున్న పుస్తకాలు మార్చాలంటే కొత్త కమిటీలను వేయాలని... కానీ ఇప్పటికిప్పుడు అలా వేయడానికి సమయం కూడా లేదన్నారు. వచ్చే ఏడాది పుస్తకాలను మార్చి... మీ పేర్లు పెట్టుకోవచ్చునని సూచించారు. విగ్రహాలు... గుర్తుల మార్పు అనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. తమకు భేషజాలు లేవని చెప్పే రేవంత్ ఇప్పుడు చేస్తుందేమిటని ప్రశ్నించారు.