ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ
- ఇటలీలో రేపు జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సు
- హాజరుకానున్న ప్రధాని మోదీ
ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సు రేపు (జూన్ 14) జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించనున్నారు.