ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కూటమి నేతలకు గవర్నర్ ఆహ్వానం
- గవర్నర్ను కలిసిన కూటమి నేతలు
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి
- కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించిన నేతలు
అంతకుముందు విజయవాడలో ఎన్డీయే శాసన సభపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభా పక్ష నేతగా కూటమి ఎమ్మెల్యేలు... చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.