కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు శాఖల కేటాయింపు

  • తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు
  • కిషన్ రెడ్డికి బొగ్గుల, గనుల శాఖ కేటాయింపు
  • బండి సంజయ్‌కి హోం శాఖ సహాయమంత్రి బాధ్యత 
తెలంగాణ నుంచి నరేంద్రమోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు శాఖలను కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించారు. కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రి బాధ్యతను అప్పగించారు.

సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి దాదాపు 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ 2.25 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వీరిద్దరూ 2019లో మొదటిసారి ఇవే నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు.

G. Kishan Reddy
Bandi Sanjay
BJP

More Telugu News