కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారు: కేరళ సీఎం విజయన్

Kerala CM condoles demise of Ramoji Rao
  • మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్న కేరళ సీఎం
  • కేరళలో వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు అండగా నిలిచారని వ్యాఖ్య
  • వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించిందన్న విజయన్
తమ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. కేరళలో వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు అండగా నిలిచారన్నారు.

వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రవేశించిన ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. రామోజీరావు మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
Go Back to Shorts
Ramoji Rao
Telangana
Kerala
Tollywood
Andhra Pradesh

More Telugu News