Theenmar Mallanna: ఎమ్మెల్సీ ఉపఎన్నిక... 19 వేల ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు రాగా, రాకేశ్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Theenmar Mallanna
Graduate MLC Elections

More Telugu News