ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలుతో సెల్ఫీ.. యువతి దుర్మరణం! వీడియో ఇదిగో!

Youth dies while taking selfie with vintage train
  • మెక్సికోలోని హిడాల్గో ప్రాంతంలో దుర్ఘటన
  • రైలు వస్తుండగా పట్టాలకు అతి దగ్గరగా జరిగి సెల్ఫీకి యువతి యత్నం
  • రైలు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయం
  • ఘటనా స్థలంలోనే మృతి చెందిన వైనం
సెల్ఫీలపై మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. రైలు సమీపించే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియో చూసి జనాలు భయపడిపోతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చేందుకు ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలవాలో అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Selfie With Vintage Train
Accident
woman Dead
Mexico
Viral Videos

More Telugu News