రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy says bjp will form government in UP
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు సాగుతామన్న విశ్వేశ్వర్ రెడ్డి
  • పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని స్పష్టీకరణ
  • బీఆర్ఎస్ తెలంగాణను పూర్తిగా అప్పుల్లోకి నెట్టి వెళ్లిపోయిందని ఆగ్రహం
  • మెదక్‌లో బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేదన్న బీజేపీ నేత
రానున్న రోజుల్లో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ తాము ముందుకు సాగుతామన్నారు. పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామన్నారు. బీఆర్ఎస్ తెలంగాణను పూర్తిగా అప్పుల్లోకి నెట్టి వెళ్లిపోయిందని మండిపడ్డారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేదని వ్యాఖ్యానించారు.

లోక్ సభ ఎన్నికలలో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని... అందుకే తమకు అత్యధిక మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు ఎన్నికల సమయంలో బాగా పని చేశారని కితాబునిచ్చారు. అందుకే ఎన్నికలు నిజాయతీగా జరిగాయన్నారు. మద్యం, డబ్బుల పంపిణీ ప్రభావం ఈ ఎన్నికల్లో అంతగా పని చేయలేదన్నారు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పని చేస్తామన్నారు.
Go Back to Shorts
Konda Vishweshwar Reddy
BJP
BRS
Congress
Telangana

More Telugu News