పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. తీన్మార్ మల్లన్నకు భారీ మెజారిటీ
- నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
- నల్లగొండ కేంద్రంలో రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి
- ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
- సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 14,672 ఓట్ల ఆధిక్యం
ఇప్పటివరకూ 1.92 లక్షల మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా, రెండు రౌండ్లలో కలిపి మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 56,113 ఓట్లు పోలయ్యాయి. ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల కౌంటింగ్ తరువాత మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.