Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు: రామ్ చరణ్

Ram Charan says this is a proud day for mega family
Advertisement
  • పిఠాపురంలో పీఠం పవన్ కల్యాణ్ దే!
  • వంగా గీతపై 70,279 ఓట్ల తేడాతో జనసేనాని విక్టరీ
  • పవన్ విజయం తిరుగులేనిది అంటూ కొనియాడిన రామ్ చరణ్
Advertisement
గత ఎన్నికల్లో  రెండు చోట్లా ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకోవడం పట్ల మెగా ఫ్యామిలీలో ఆనందం అంబరాన్నంటుతోంది. ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ తన సమీప వైసీపీ ప్రత్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

ఈ నేపథ్యంలో, పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయంపై స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు. మా పవన్ కల్యాణ్ గారికి శుభాభినందనలు. ఆయన విజయం తిరుగులేనిది" అంటూ రామ్ చరణ్ కొనియాడారు.
Advertisement
Advertisement
Ram Charan
Pawan Kalyan
Pithapuram
Janasena
Mega Family

More Telugu News