Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీపై నేను చెప్పింది నిజమైంది... జగన్ గెలుస్తాడన్న నా అంచనా తప్పింది: వేణుస్వామి

Venu Swami apologies for his wrong predictions
Advertisement
  • దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను... అలాగే జరిగిందన్న వేణుస్వామి
  • పోటీ చేసిన వారి జాతకాన్ని బట్టి ఫలితాలను చెప్పానని వెల్లడి
  • ఏపీలో నేను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానన్న వేణుస్వామి
Advertisement
లోక్ సభ ఎన్నికల్లో తన అంచనాలు నిజమయ్యాయని... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన లెక్క తప్పిందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతుందని తాను చెప్పానని... అది నిజమైందని పేర్కొన్నారు. కానీ ఏపీలో మాత్రం జగన్ విజయం సాధిస్తారని చెప్పానని... కానీ తన అంచనాలు తప్పాయన్నారు.

తాను చెప్పిన రెండింట్లో ఒకటి నిజమైందని... మరొకటి లెక్క తప్పిందన్నారు. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి తాను అభిప్రాయాలను వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకం ఆధారంగా చేసుకొని తాను ఫలితాలను చెప్పానని అన్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Lok Sabha Polls
Andhra Pradesh Assembly
Telugudesam
YSRCP
Narendra Modi
Venu Swamy

More Telugu News